Nakkapalle: ఈఓఆర్డీ, సెక్రటరీలపై రిటర్నింగ్ అధికారిపై అనిత ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, నక్కపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పద్మారావుకి ఫిర్యాదు చేశారు.

K V D Varma
Updated on: 17 March 2020 6:43 PM IST
Nakkapalle: ఈఓఆర్డీ, సెక్రటరీలపై రిటర్నింగ్ అధికారిపై అనిత ఫిర్యాదు
X
TDP Leader Vangalapudi Anitha

నక్కపల్లి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, నక్కపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పద్మారావుకి ఫిర్యాదు చేశారు. నక్కపల్లి మండలం డొంకడ గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ తరుపున దాఖలైన నామినేషన్ పత్రాలను తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో అధికారులు వ్యవరించిన తీరు పట్ల ఆమె నాయకులుతో కలిసి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఈఓఆర్డీ, పంచాయితీ సెక్రటరీలు ఎన్నికల నియమాలను పాటించకుండా వైసీపీ నాయకుల వత్తిడి కారణంగా అభ్యర్ధుల నామినేషన్లు రిజెక్ట్ అయ్యే విధంగా వ్యవరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కావున ఈ ఇద్దరు అధికారులుపై ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆమె రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ కి , రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫార్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వై వినోద్ రాజు, కొప్పిశెట్టి వెంకటేష్, లాలం కాశీనాయుడు, వెంకట్రాజు, బాబ్జీరాజు, గుర్రం రామకృష్ణ, మాతా గురునాథ్, కొప్పిశెట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.



K V D Varma

K V D Varma

Next Story