వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల
x
Highlights

Panchakarla Ramesh: ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు వైసీపీలో చేరారు. శుక్రవారం...

Panchakarla Ramesh: ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు వైసీపీలో చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రమేశ్‌బాబు పార్టీ కండువాకప్పుకున్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి కన్నబాబుపై పోటీ చేసి, ఓడిపోయారు. ఇక విశాఖ రాజధానిని టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇక మూడు రాజధానుల నిర్ణయానికి ఓకే చెబుతూ తాజాగా పంచకర్ల వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు పంచకర్ల రాకతో విశాఖలో వైసీపీ బలం మరింత పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories