టీడీఎల్పీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు..

కరోనా మహమ్మారిపై పోరాటంలో తెదేపా రాజకీయాలకు అతీతంగా ప్రజల పట్ల పూర్తి అంకితభావంతో భాగస్వామి అవుతుందని స్పష్టం చేశారు.

S. Srikanth
Published on: 26 March 2020 7:47 PM IST
టీడీఎల్పీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు..
X

కరోనా మహమ్మారిపై పోరాటంలో తెదేపా రాజకీయాలకు అతీతంగా ప్రజల పట్ల పూర్తి అంకితభావంతో భాగస్వామి అవుతుందని స్పష్టం చేశారు. ప్రజలను కాపాడటంలో ముందుండి పోరాడే యోధులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాలన్నారు. డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఫ్రంట్ లైన్ వారియర్స్​గా కరోనాపై చేస్తున్న పోరాటాన్ని ఆయన అభినందించారు.

నిత్యావసరాలు, కూరగాయలు రవాణా, సరఫరాలో నిమగ్నమైన అందరికీ అభినందనలు తెలిపారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి అన్నివర్గాల సంఘీభావం, సమిష్టి సహకారమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్​లో తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story