Chandrababu: రేపు, ఎల్లుండి కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababu: కుప్పం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

Jyothi
Published on: 24 March 2024 9:36 AM IST
TDP chief Chandrababu Kuppam Tour fix
X

Chandrababu: రేపు, ఎల్లుండి కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు 

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం టూర్ ఫిక్స్ అయ్యింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం నుంచే ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కుప్పం చేరుకుంటారు. అక్కడి స్థానిక కన్యకా పరమేశ్వరి ఆయలంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 12 గంటలకు టీడీపీ పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగే బహిరంగ సభ‌లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కేవీఆర్ కల్యాణ మండపంలో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. అనంతరం రాత్రి R&B గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు.

రెండు రోజు పర్యటనలో భాగంగా ఉదయం ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. తర్వాత రాజుపేట దగ్గర హంద్రీ-నీవా కాలున పరిశీలించనున్నారు. తిరిగి రాత్రికి R&B అతిథిగృహంలో బస చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story