లాంగ్ మార్చ్ లో పాల్గోవాలని కోరిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖ లాంగ్ మార్చ్‌లో పాల్గొనాల్సిందిగా పలు రాజకీయ పక్షాల అగ్రనేతలకు ఫోన్ చేశారు. కార్మికుల కోరిక మేరకు విపక్షాలను ఏకం చేయాలని కోరారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాకు ఫోన్ చేసి మాట్లాడారు. దీనిపై ఇటు చంద్రబాబు, అటు కన్నా లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించారు. మరోవైపు కాంగ్రెస్, లోక్‌సత్తా, వామపక్షాలకు సైతం పవన్ ఫోన్లు చేయగా.. పార్టీలో చర్చిస్తామని తెలిపారు.
Next Story




