Mandapeta: టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్థిగా గడి సత్యవతి

Mandapeta: టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్థిగా గడి సత్యవతి
x
గడి సత్యవతి
Highlights

మండపేట పుర పోరు వేడి రగులుతుంది. అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తి చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఛైర్మన్ చుండ్రు వర ప్రకాష్, వ్యూహ కర్త ఐ ఎస్ ఎన్, మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణ రావు, మల్లి పూడి గణేష్ లు అభ్యర్థులను ఓడపోస్తున్నారు.

మండపేట: మండపేట పుర పోరు వేడి రగులుతుంది. అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తి చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఛైర్మన్ చుండ్రు వర ప్రకాష్, వ్యూహ కర్త ఐ ఎస్ ఎన్, మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణ రావు, మల్లి పూడి గణేష్ లు అభ్యర్థులను ఓడపోస్తున్నారు. వార్డు లో అభ్యరికి ఉన్న బల బాలను బేరీజు వేస్తున్నారు. సామాజిక వర్గాల సమతుకం పాటిస్తూ బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. ఓసి జనరల్ స్థానాల్లో సైతం బీసీలకు సీట్లు కేటాయిస్తూ సరికొత్త రాజకీయ వ్యూహం చేస్తున్నారు.

ఈ క్రమంలో తొలి నుండి అనుకున్న విధంగా చైర్ పర్సన్ అభ్యర్థి, మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ గడి సత్యవతి గురు వారం ఉదయం మునిసిపల్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. అలాగే అధికారికంగా ప్రకటించి న కౌన్సిల్ అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. కొన్ని వార్డుల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ కి సిద్ధం కావడంతో వారిలో ఒకరికి సిటు ప్రకటించడం కష్ట తరంగా మారింది. దీంతో వ్యూ హాత్మకంగా జాప్యం చేస్తున్నారు.

ఇప్పటివరకు ఖరారైన టీడీపీ జాబితా ఇలా ఉంది. 1 వ వార్డు జనరల్ లో బీసీ అభ్యర్థి పెంకే లోవ కుమార్, 2 వ వార్డ్ జనరల్ లో బీసీ అభ్యర్థి కేతా వెంకట రమణ లకు టిక్కెట్లు ఇచ్చారు. 4 వ వార్డు గుండు రామ తులసి, 6 వ వార్డు కాశీన కాశి విశ్వనాధ్, 9 వ వార్డు చుండ్రు సుబ్బారావు చౌదరి, 10 వ వార్డు శిరం గు జ్యోతి, 16 వ వార్డు గానిశెట్టి బాబీ, 18 సంకు మాధవి దేవి, 22 రొట్ట లక్ష్మి, 25 వ వార్డు అల్లక పద్మ పొలారాజు, 27 వ వార్డు రాంబిల్లి పాపారావు, 29 షేక్ ఇబ్రహీం, 30 వ వార్డు గుత్తుల సత్తిబాబు లకు టికెట్లు ఇచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories