నీ దిక్కున్న చోట చెప్పుకో పో.. గడపగడపలో మహిళపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం

Tammineni Sitaram Fire on Anganwadi Teacher
x

నీ దిక్కున్న చోట చెప్పుకో పో.. గడపగడపలో మహిళపై స్పీకర్‌ తమ్మినేని ఆగ్రహం

Highlights

Tammineni Sitaram: అంగన్వాడి టీచర్‌పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం

Tammineni Sitaram: గడప గడపకు జగనన్న సర్కారు కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ మహిళపై ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం నెల్లిపర్తిలో తమ్మినేని సీతారాం ఇంటింటికెళ్లి ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు అమలు, అధికారుల పనితీరుపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటింటికి వెల్లి బాబాయ్, మామ ఎలా ఉన్నారంటూ చిరనవ్వుతో పలుకరిస్తూ ముందుకు సాగారు.

నెల్లిపర్తిలో పనిచేస్తున్న పద్మ అనే అంగన్వాడీ టీచర్, తనకు జరిగిన అన్యాయాన్ని తమ్మినేని సీతారాంకు వివరించే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆయన ముందుకు సాగిపోగా... నా ప్రోబ్లం వినండి సారంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ఫ్రస్టేషన్ కు గురైన స్పీకర్ తమ్మినేని సీతారం... దిక్కున్న చోట చెప్పుకోమని సమాధానమిచ్చారు.

స్పీకర్ తమ్మినేని సమాధానానికి ఖంగుతిన్న అంగన్వాడీ టీచర్... స్పీకర్ స్థాయి వ్యక్తి... దిగజారి మాట్లాడటమేంటని ఆశ్చర్యం వ్యక్తంచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories