Sullurpeta: షార్ లో కరోనా వ్యాధి లక్షణాలు అనుమానం

షార్ కాలనీ కేఆర్పిఓ యువతికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

admin1
Published on: 14 March 2020 12:30 PM IST
Sullurpeta: షార్ లో కరోనా వ్యాధి లక్షణాలు అనుమానం
X
Suspected corona disease symptoms in Shar

సూళ్లూరుపేట: షార్ కాలనీ కేఆర్పిఓ యువతికి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.ఆమె తండ్రి ఆర్టీసీ కండెక్టర్ కాగా తల్లి షార్ కేంద్రీయ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తూ కేఆర్పిఓ కాలనీలో నివసిస్తున్నట్లు సమాచారం. వీరి కుమార్తె ఇటలీలో చదువుకుంటూ వారం క్రితం ఇక్కడికి వచ్చిందని తెలిసింది. ఆమె స్వదేశానికి వచ్చినప్పుడు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో చెన్నై విమానాశ్రమంలో పరీక్షించి పంపినట్లు సమాచారం. అయితే గురువారం ఆమెకు జ్వరం రావడంతో హుటాహుటిన షార్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షలు చేస్తున్నారని, కుటుంబ సభ్యులకూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

అయితేఈ విషయం వెల్లడి కాకుండా షార్ యాజమాన్యం రహస్యంగా ఉంచింది. అయినా బయటకు పొక్కడంతో ప్రజలు భయాందోళన కు గురవుతున్నారు. అయితే ఆ యువతికి కరోనా సోకింది ఆరోగ్యంగా ఉందని, ముందు జాగ్రత్త చర్యగా ఇంటిలోనే ఐసోలేషన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా సూళ్లూరుపేట కు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కూడా ఇటలీ నుంచి వచ్చింది ప్రచారం జరుగుతున్నప్పటికీ వారెవరు అన్నది అంతుచిక్కడం లేదు.


admin1

admin1

Next Story