TDP: టికెట్ రాలేదన్న మనస్తాపంతో.. టీడీపీ నేత ఆకెపోగు ప్రభాకర్‌ ఆత్మహత్యాయత్నం

TDP: ఏనాడూ పార్టీ జెండా మోయని వ్యక్తికి.. టికెట్ కేటాయించారంటోన్న ఆకెపోగు ప్రభాకర్ భార్య

Shekhar G
Published on: 26 Feb 2024 6:28 PM IST
Suicide Attempt Karnool District TDP Leader Akapogu Prabhakar
X

TDP: టికెట్ రాలేదన్న మనస్తాపంతో.. టీడీపీ నేత ఆకెపోగు ప్రభాకర్‌ ఆత్మహత్యాయత్నం

TDP: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం టిడిపి ఆశావహ అభ్యర్థి ఆకెపోగు ప్రభాకర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఫస్ట్‌లిస్ట్‌లో కోడుమూరు స్థానం దస్తగిరికి ఇవ్వడంతో.. తనకు టికెట్ రాలేదన్న మనస్తాపంతో పురుగుల మందు సేవించారు. వెంటనే ఆయన్ను మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

30 ఏళ్లుగా ప్రభాకర్‌ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తే.. ఏనాడూ జెండా మోయని దస్తగిరికి టికెట్ ఇచ్చారంటూ ప్రభాకర్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. నారా లోకేష్ పునరాలోచించి సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ప్రభాకర్ భార్య. మరోవైపు కోడుమూరు నియోజకవర్గంలోని టిడిపి సభ్యులు ప్రభాకర్‌కి మద్దతుగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. బొగ్గుల దస్తగిరికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని తేల్చిచెబుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story