Ration Card: తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త..!

Ration Card: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. రేషన్‌ సరుకుల్లో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు కూడా అందించనుంది.

Arun Chilukuri
Published on: 18 Jun 2024 11:24 AM IST
Sugar and Toor dal Will be Suplied to White Ration Card Holders in AP
X

Ration Card: తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త..!

Ration Card: ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. రేషన్‌ సరుకుల్లో బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు కూడా అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే నెల నుంచే వాటిని బియ్యంతోపాటు అందించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. అయితే ఇది కేవలం తెల్ల రేషన్‌ కార్డుదారులకు మాత్రమే అందించనున్నారు.

గత కొన్నిరోజులుగా ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొత్తగా వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించింది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ జరగడం లేదనే వార్త సీఎం చంద్రబాబు దృష్టికి రాగా.. ఆయన వెంటనే స్పందించారు. కందిపప్పు పంపిణీ వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఆదేశించినట్లు సమాచారం.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు. భారీ మొత్తంలో కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లను పంపిణీకి అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని జులై 1 నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు అందించనున్నారు. పలు జిల్లా కేంద్రాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరిన నిత్యావసరాలను అధికారులు తూకం వేసి పరిశీలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story