Andhra Pradesh: విజయం చిన్నదైనా స్ఫూర్తి ఉజ్వలంగా ఉండాలి

Andhra Pradesh: విజయం చిన్నదైనా స్ఫూర్తి ఉజ్వలంగా ఉండాలి
x
Highlights

విజయం చిన్నదైనా స్ఫూర్తి ఉజ్వలంగా ఉండాలని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సెక్రటరీ సీహెచ్ విజయ్ ప్రకాష్ స్పష్టం చేశారు.

విజయం చిన్నదైనా స్ఫూర్తి ఉజ్వలంగా ఉంటుందని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అభినందన సభలో సంస్థ సంయుక్త కార్యదర్శి విజయ ప్రకాష్ అన్నారు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో, జిల్లా మరియు పట్టణ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నందు అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది.

విద్య, సాంస్కృతిక, క్విజ్, ఆటపాటలు, పోటీ పరీక్షలు, సైన్స్ కాంగ్రెస్ వంటి అనేక పోటీల నందు ప్రతిభ కనబరిచిన శ్రీ ప్రకాష్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులతో పాటుగా విజయ ప్రకాష్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో సుమారు 11 వందల 50 మంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా మరియు పట్టణ స్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రిన్సిపల్ ఎంవివిఎస్ మూర్తి, శ్రీ ప్రకాష్ వివిధ విభాగాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories