విద్యార్థులు ఇష్టపడి చదవాలి

విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తిరుపతి ఐఐటీ డైరెక్టర్, ప్రొఫెసర్ కె.ఎస్ సత్యనారాయణ సూచించారు.

S. Srikanth
Published on: 14 Dec 2019 3:36 PM IST
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
X
ప్రొఫెసర్ కె.ఎస్ సత్యనారాయణ, ప్రొఫెసర్ నటరాజన్, ప్రొఫెసర్ పుల్లారావు

ఏర్పేడు: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తిరుపతి ఐఐటీ డైరెక్టర్, ప్రొఫెసర్ కె.ఎస్ సత్యనారాయణ సూచించారు. తిరుపతి ఐఐటీ ఏర్పేడు క్యాంపస్ లో పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన 50 మంది జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో మంది ఐఐటీలో చదవాలని కోరుతున్నారని అయితే ఇప్పటి చదువుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఐఐటీలో చేపట్టిన అభివృద్ధి పనులను వారికి వివరించారు. అనంతరం ప్రొఫెసర్ నటరాజన్ మాట్లాడుతూ విద్యార్థులు ఐటీలో చేరేందుకు ప్రోత్సాహం కలిగించడం కోసం ఇలాంటి సందర్శన కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పుల్లారావు, చిత్తూరు నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ కాశయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story