Lakkireddipalli: పురాతన పంచలోహ విగ్రహం లభ్యం
Sri Mahavishnu Panchaloha Statue
లక్కిరెడ్డిపల్లి: మండలం పరిధిలోని పంచాయతీ శ్రీ మహావిష్ణువు పంచలోహ విగ్రహం బయట పడిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం మేరకు సోమలవాండ్లపల్లికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని మద్దిరేవుల వంకతో పొలం పనుల కోసం మట్టిని తవ్వుతున్న సమయంలో శ్రీ మహావిష్ణువు పంచలోహ విగ్రహం బయటపడింది. వెంటనే గ్రామస్తులు అక్కడి చేరుకుని పంచలోహ విగ్రహాన్ని గ్రామంలోని దేవాలయం వద్దకు తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. పూర్వం అక్కడ దేవాలయం ఉండేదని, అప్పట్లో ప్రజలు పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు పెద్దలు చెబుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విగ్రహాన్ని లక్కిరెడ్డిపల్లి పోలీసులకు అప్పగిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.
Next Story


