Srisailam: శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం.. పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక..

Srisailam: దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు

Shekhar G
Published on: 9 Feb 2024 6:45 PM IST
Srisailam A Piece Of Chicken In The Srisailam Prasadam
X

Srisailam: శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం.. పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక.. 

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుంది. పులిహోర ప్రసాదంలో మాంసపు ఎముక కలకలం రేపింది. భక్తులకు అందించే పులిహోర ప్రసాదంలో ఎముక ప్రత్యక్షమైంది. అమ్మవారి ఆలయ బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీలో చోటు చేసుకుంది. పులిహారలో మాంసపు ముక్కను హైదరాబాద్‌కు చెందిన భక్తుడు హరీష్‌రెడ్డి గుర్తించారు. దీంతో దేవస్థానం అధికారులకు ఆధారాలతో భక్తుడు ఫిర్యాదు చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపంపై భక్తులు మండిపడ్డారు. ప్రసాదంలో ఎముక రావడంపై అధికారులు విచారణ చేపట్టారు.

Shekhar G

Shekhar G

Next Story