Andhra Pradesh: జాతీయ స్థాయి పోటీలో శ్రీ ప్రకాష్ విద్యార్థిని ప్రతిభ

S. Srikanth
Published on: 22 Jan 2020 5:58 PM IST
Andhra Pradesh: జాతీయ స్థాయి పోటీలో శ్రీ ప్రకాష్ విద్యార్థిని ప్రతిభ
X

తుని: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఛత్తీస్ ఘడ్ లో జరిగిన 65వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ లో 6వ తరగతి చదువుతున్న కసిరెడ్డి సూర్య అక్షయ థాయ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది.

ఆంధ్రప్రదేశ్ తరుపున అండర్ 17 విభాగంలో 56-60 వెయిట్ కేటగిరీలో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. జాతీయస్థాయి థాయ్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన విద్యార్థినిని విద్యాసంస్థల అధినేత సి.హెచ్.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సి.హెచ్. విజయ్ ప్రకాష్ , సీనియర్ ప్రిన్సిపల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపల్ పరేష్ కుమార్ దాస్, ఉపాధ్యాయులు అభినందించారు.


S. Srikanth

S. Srikanth

Next Story