Payakaraopeta: శ్రీ ప్రకాష్ నందు ఘనంగా ప్రారంభమైన స్పందన

Payakaraopeta: శ్రీ ప్రకాష్ నందు ఘనంగా ప్రారంభమైన స్పందన
x
Highlights

నిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థలైన స్పేసేస్ డిగ్రీ కళాశాల నందు స్పందన (ఇంటర్ కాలేజీ యూత్ ఫెస్టివల్) ఆదివారం మద్యాహ్నం ఘనంగా ప్రారంభమైనది.

పాయకరావుపేట: స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థలైన స్పేసేస్ డిగ్రీ కళాశాల నందు స్పందన (ఇంటర్ కాలేజీ యూత్ ఫెస్టివల్) ఆదివారం మద్యాహ్నం ఘనంగా ప్రారంభమైనది. ఈ యూత్ ఫెస్టివల్ నందు శ్రీ ప్రకాష్ అనుబంధ సంస్థలు స్పేసేస్ డిగ్రీ కళాశాల, శ్రీ వెంకటేశ్వరా కాలేజీ అఫ్ ఎడ్యుకేషన్ , శ్రీ వెంకటేశ్వర కాలేజీ అఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ విద్యార్థులు తమ ఆటపాటలతో మరియు నృత్యాలతో సందడి చేశారు.

సంగీతం, సాహిత్యం, నృత్యం, థియేటర్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ మరియు క్రీడల నందు సుమారు 30 అంశాలను విద్యార్థినీ విద్యార్థులకు పోటీలు నిర్వహింపబడినవి. కాగా కార్యక్రమాన్ని స్పందన కన్వీనర్ డాక్టర్ కే. వీర్రాజు, శ్రీ వెంకటేశ్వర కాలేజీ అఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ యాని అమల, డైరెక్టర్ వి.వి.ఎస్. బి.బంగార్రాజు, విద్యార్థి అతిధులు, మోడరేటర్ నీలా లోహిత్ చిత్రాపు, శాంతి కపోతాలు ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థి అతిథులుతో మోడరేటర్ నీలా లోహిత్ చిత్రాపు నిర్వహించిన సాంకేతికత మానవ వినియోగిత ను తగ్గిస్తున్నదా అనే అంశం పై నిర్వహించిన చర్చా గోష్టి కార్యక్రమం నందు విద్యార్థి అతిధులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.



Show Full Article
Print Article
Next Story
More Stories