Guntur: పారిశుద్ధ్య కార్మికులకు రూ.లక్ష విరాళం

S. Srikanth
Published on: 16 April 2020 1:41 PM IST
Guntur: పారిశుద్ధ్య కార్మికులకు రూ.లక్ష విరాళం
X

గుంటూరు: బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ గుంటూరు నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం రూ.లక్ష విరాళంను చెక్కు రూపంలో గురువారం మున్సి పల్ కార్పొరేషన్ కమిషనర్ అనురాధను కలసి మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి నేతృత్వంలో బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి పౌం డేషన్ ప్రతినిధి పెండేల ప్రసాదు అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ నగరంలో ప్రతి ఆపద సమయంలో డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆదుకుంటున్నారని అన్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయనిధికి రూ ఐదు లక్షలు, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు రూ.రెండు లక్షలు అందించారన్నారు. లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయటానికి నగరంలో కమిషనర్ అనురాధ అవిరళ కృషి చేస్తున్నారని అభినందించారు. నగరంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు యజమానులందరూ వేతనాలు చెల్లించాలని విన్నవించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ ప్రతి ఒక్కరు వారికి తోడ్పాటునoదించాలని విజ్ఞప్తి చేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story