Srikalahasti MLA tested corona positive: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దంపతులకు కరోనా పాజిటివ్!

Srikalahasti MLA tested corona positive: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా వేలాది కేసులు నమోదవుతున్నాయి.

Raj
By Raj
Published on: 18 July 2020 11:46 AM IST
Srikalahasti MLA tested corona positive: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే దంపతులకు కరోనా పాజిటివ్!
X
Srikalahasti MLA tested corona positive

Srikalahasti MLA tested corona positive: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా వేలాది కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు కరోనా భారిన పడ్డారు. ఇద్దరికి పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీవాణిరెడ్డి చికిత్స తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ఆయన కొడుకు, కుమార్తె అలాగే శ్రీకాళహస్తి వైసీపీ కార్యాలయంలోని సిబ్బంది, పలువురు కార్యకర్తలకు కరోనా పరీక్షల కోసం వైద్య సిబ్బంది శాంపిల్స్ ను సేకరిస్తున్నారు.

మరోవైపు కరోనా అనుమానంతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కొద్దిరోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో ఆయన కూతురు పవిత్రారెడ్డి పార్టీ తరఫున కార్యక్రమాలు చూస్తున్నారు. అయితే ఇటీవల ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వద్దకు వచ్చిన పార్టీ కార్యకర్తల ద్వారా వారికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కూడా కరోనా భారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఆయన వద్దకు వచ్చిన కుటుంబసభ్యులు, కార్యకర్తలను పరీక్షలు చేయించుకోవలసిందిగా సూచించారు.

Raj

Raj

Next Story