విశాఖకు విదేశాల నుంచి రానున్న విమానాలు

Arun Chilukuri
Published on: 16 May 2020 1:56 PM IST
విశాఖకు విదేశాల నుంచి రానున్న విమానాలు
X

ఈ నెల 19, 20, 22 తేదీల్లో విదేశాల నుంచి విశాఖకు విమానాలు రానుండటంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో ఉండిపోయిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 700 మంది తెలుగువారు నాలుగు విమానాల్లో రానున్నారు.

దీంతో వచ్చే ప్రయాణీకులను పరీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు విమానాశ్రయం డైరెక్టర్ రాజకిశోర్‌ తెలిపారు. ప్రయాణీకులను స్కానింగ్ యంత్రాలతో పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు తరలిస్తామన్నారు. అంతేకాకుండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే ప్రత్యేకంగా రూపొందించిన సిమ్‌ కార్డును మొబైల్ ఫోన్ లలో అమర్చి ఆరోగ్యసేతు యాప్ ను అనుసంధానం చేయనున్నామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story