సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు: జనరల్ మేనేజర్ గజానన్ మాల్య

సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు: జనరల్ మేనేజర్ గజానన్ మాల్య
x
Highlights

దక్షిణ మధ్య రైల్వే 2018-19లో రికార్డు స్థాయిలో 1221 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించిందనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 128 మిలియన్...

దక్షిణ మధ్య రైల్వే 2018-19లో రికార్డు స్థాయిలో 1221 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించిందనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 128 మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యంతో కృషిచేస్తోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అన్నారు. సరుకు రవాణా దారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓబులవారిపల్లె - కృష్ణపట్నం పోర్టు మధ్య నిర్మించిన నూతన రైలు మార్గం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వారితో చర్చించారు. దీనిలో కృష్ణపట్నం పోర్టు, జిందాల్ స్టీల్ సంస్థల అధికారులతో పాటు పలు సిమెంట్, విద్యుత్ మరియు ఎరువుల కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

నూతన రైలు మార్గాన్ని వినియోగించుకొని దిగుమతైన సరుకులను కృష్ణపట్నం పోర్టు నుండి యర్రగుంట్ల లోతట్టు ప్రాంతాలలో నెలకొన్న సిమెంటు కంపెనీలకు , బళ్ళారిలోని జిందాల్ స్టీల్ ప్లాంట్లకు రవాణా చేసే విషయాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ మార్గాన్ని అత్యధికంగా వినియోగించుకొనేందుకు జిందాల్, అల్ట్రాటెక్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేసాయి. వచ్చే ఐదు సంవత్సరాలలో తమ ఉత్పత్తిని రెండింతలు చేసే ప్రణాళికతో కృషి చేస్తున్నామని అప్పడు నూతన రైలు మార్గం ఎంతో ఉపయోగ పడుతుందని జిందాల్ సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది.

గత సంవత్సరం కృష్ణపట్నం పోర్టు నుండి జరిగిన సరుకు రవాణా పనితీరును, ఈ సంవత్సరం మొదటి తైమాసికంలో జోన్ సరుకు రవాణా పనితీరును జనరల్ మేనేజర్ సమీక్షించారు. మొదటి త్రైమాసికంలో సరుకు రవాణాల్లో నిదానమైన ప్రగతి గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ నూతన రైలు మార్గం ద్వారా సరుకు రవాణాలో రాబోయే కాలంలో అభివృద్ధి అధికంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్త పరిచారు.

ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కె. శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్, విజయవాడ డివిజన్ డిఆర్ఎం పి. శ్రీనివాస్, చీఫ్ ఫైట్ ట్రాఫిక్ మేనేజర్ బి. నాగ్య పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories