Sonu Sood: నెల్లూరు జిల్లాకు సోనూసూద్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌

Sonu Sood: ఆక్సిజన్‌ ప్లాంట్‌కు ఘనస్వాగతం పలికిన ప్రజలు * క్రాకర్స్‌, బైక్‌ ర్యాలీల మధ్య ఆక్సిజన్‌ ప్లాంట్‌ తరలింపు

Sandeep Eggoju
Updated on: 6 July 2021 1:05 PM IST
Sonu Sood Sent Oxygen Plant to Nellore District Today 06th July 2021 | Sonu Sood News in Telugu
X

నెల్లూరుకు చేరుకున్న సోను సూద్ ఆక్సిజన్ ప్లాంట్ (ఫోటో ట్విట్టర్)

Sonu Sood: కరోనా కష్టకాలంలో సామాన్యులందరి నోట పలికిన మాట సోనూసూద్‌. కష్టం ఏదైనా సరే.. సాయం అందించేది మాత్రం సోనూసూదే అనే భావన ప్రజల్లో నెలకొంది. ఇలా.. అన్నింటా పేదవాడికి అండగా ఉంటూ.. స్క్రీన్‌పై విలన్‌గా కనిపించే సోనూ భాయ్.. రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరోగా పేరొందారు.

సెకండ్‌వేవ్‌ సమయంలో భారత్‌లో విపరీతమైన ఆక్సిజన్‌ కొరత నెలకొంది. దీంతో.. దానిని అధిగమించేందుకు ముందుకొచ్చారు సోనూసూద్‌. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నడుం బిగించారు. తాజాగా.. నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పంపించారు ఆయన. దీంతో.. నెల్లూరు ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నెల్లూరుకు చేరుకున్న ఆక్సిజన్‌ ప్లాంట్‌కు ఘనస్వాగతం పలికారు అక్కడి ప్రజలు. మందు సామాగ్రి పేలుస్తూ, బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. సోనూ సేవను కొనియాడారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story