Sonu Sood: ఆమె ఇండియాలోనే అత్యంత ధనవంతురాలంటూ రియల్‌ హీరో ట్వీట్‌

Sonu Sood: ఎందరో కరోనా బాధితులకు సోనూసూద్‌ ఫౌండేషన్‌ అండగా నిలుస్తోంది.

Arun Chilukuri
Published on: 15 May 2021 12:12 PM IST
Sonu Sood Praises Nagalakshmi
X

Sonu Sood: ఆమె ఇండియాలోనే అత్యంత ధనవంతురాలంటూ రియల్‌ హీరో ట్వీట్‌

Sonu Sood: ఎందరో కరోనా బాధితులకు సోనూసూద్‌ ఫౌండేషన్‌ అండగా నిలుస్తోంది. ఎక్కడ ఎవరూ సాయం కోరినా అక్కడ సోనూ వాలంటీర్లు వాలిపోయి సాయం చేస్తూ వస్తున్నారు. ఈ సోనూ ఫౌండేషన్ కి పలువురు దాతలు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఓ దివ్యాంగురాలి దాతృత్వానికి సోనూ సూద్‌ ఫిదా అయ్యాడు. ఏపీలోని వరికుంటపాడుకు చెందిన అంధయువతి బొడ్డు నాగలక్ష్మి సోనూ ఫౌండేషన్‌కు విరాళం పంపించింది. 5నెలల పెన్షన్‌ డబ్బులను 15వేలు జమ చేసి ఫౌండేషన్‌కు పంచించింది.

ఇదే విషయాన్ని సోనూసూద్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తన దృష్టిలో నాగలక్ష్మి రిచెస్ట్ ఇండియన్ గా అభివర్ణించారు. అంతే కాదు ఒకరి బాధను చూడటానికి కంటిచూపు అవసరం లేదని నాగలక్ష్మి నిరూపించారని ప్రశంసించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story