Chandrababu Naidu: సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉంది

Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వ విధ్వంసంపై యుద్ధభేరి చేపట్టాం

Shekhar G
Published on: 6 Aug 2023 5:50 PM IST
Somasila Dam Is In Danger Says Chandrababu Naidu
X

Chandrababu Naidu: సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉంది

Chandrababu Naidu: ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న విధ్వంసంపై యుద్దభేరి చేపట్టామని, సాగునీటి రంగంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా నెల్లూరులో చంద్రబాబు పర్యటించారు. ఐదు నదులు అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవని, నీటిని సద్వినియోగం చేసుకుంటే సిరులు పండించవచ్చునని చెప్పారు. సోమశిల , కండలేరు పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారన్నారు. పనులు ఆగిపోవడంతో సోమశిల డ్యామ్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. గండిపాలెం కాలువల నిర్వహణ గాలికి వదిలేశారని, పెద్దిరెడ్డి సాగర్‌ పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story