మంచు దుప్పటిలో మన్యం

గ్రామీణ ప్రాంతాల్లో చలి విజృంభించింది. మంచు దట్టంగా కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగి జనం గజ్జలడుతున్నారు.

S. Srikanth
Published on: 17 Jan 2020 1:24 PM IST
మంచు దుప్పటిలో మన్యం
X

గూడెంకొత్తవీధి: గ్రామీణ ప్రాంతాల్లో చలి విజృంభించింది. మంచు దట్టంగా కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగి జనం గజ్జలడుతున్నారు. చింతపల్లి, లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మన్య ప్రాంతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలి పెరగడమే కాక ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.

దీనికితోడు దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో చలి తీవ్రతను తట్టుకోలేక పోతున్నారు. ఉన్ని దుస్తులు ధరించిన, మంటలు పెట్టుకున్నా చలి పులిని నిలువరించ లేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మన్య ప్రాంత వాసులు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవడమే గాక చలితీవ్రత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story