శాంతిభద్రతల పరిరక్షణ అందరి సహకారంతోనే సాధ్యం

పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని ఒకటో పట్టణ ఎస్ ఐ సూర్య శ్రీ నివాస్ పేర్కొన్నారు.

S. Srikanth
Published on: 18 Jan 2020 11:31 AM IST
శాంతిభద్రతల పరిరక్షణ అందరి సహకారంతోనే సాధ్యం
X

గుడివాడ: పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని ఒకటో పట్టణ ఎస్ ఐ సూర్య శ్రీ నివాస్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ కాలనీలో టోల్ ఫ్రీ నెంబర్లు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పేదవాడల్లో ఇటువంటి వివాదం సమస్య తలెత్తిన వెంటనే 100 నంబరుకు కు ఫోన్ చేయాలని కోరారు.

అసాంఘిక కార్య అక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే 100 నెంబర్ కి కాల్ చేసి చెప్పాలన్నారు. ఎవరైనా ఇంటికి తాళం పెట్టి వేరే ఊరు వెళితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసులు లాక్ డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా తాళం వేసి ఊరు వెళ్లిన వారి ఇళ్ళకు సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా 24 గంటలు నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

S. Srikanth

S. Srikanth

Next Story