YS Sharmila: అసెంబ్లీకి వెళ్లని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

YS Sharmila: అసెంబ్లీకి వెళ్లని వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా డిమాండ్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 28 July 2024 11:55 AM IST
Sharmila Demanded Jagan And YSRCP MLA Should Resign From The Post Of Mlas
X

YS Sharmila: అసెంబ్లీకి వెళ్లని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

YS Sharmila: అసెంబ్లీకి వెళ్లని వైఎస్ జగన్.. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతాననడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఇంతకంటే పిరికితనం, చేతకానితనం ఉండదన్నారు. మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చే బాధ్యత మీది కాదా అని.. ఎమ్మెల్యేగా గెలిచింది మీడియా ముందు సొంత డబ్బ కొట్టుకోవడానికా అని ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

షర్మిల ట్వీట్ ప్రకారం.. సిగ్గు సిగ్గు!! ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకుముంచిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమీ కాదు జగన్ మోహన్ రెడ్డి అంటూ షర్మిల అన్నారు. కానీ, మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనం అని అన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? అంటూ షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడి అని.. రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని.. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే.. తాపిగా ప్యాలస్ లో కూర్చుని మీడియా మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది. గత మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా..? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి అంటూ షర్మిల అన్నారు.

బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్టికా మంచులోకే పోతారో ఎవడికి కావాలి. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల అన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story