రెండో విడత ఉచిత రేషన్‌ సరుకులు పంపిణీ

S. Srikanth
Published on: 16 April 2020 2:38 PM IST
రెండో విడత ఉచిత రేషన్‌ సరుకులు పంపిణీ
X

ఎస్.రాయవరం: రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రెండో విడత సరుకులు మండలం కొత్త రేవుపోలవరంలో ప్రారంభమైంది. మొదటి విడతగా మార్చి 29వ తేదీ నుంచి కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసిన చేయగా, రెండో విడతగా లబ్దిదారులకు బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందిస్తున్నారు. సరుకులు పొందేందుకు కూపన్లు జారీ చేశారు. లబ్ధదారులు భౌతిక దూరం పాటించే విధంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story