Badvel: రెండవ రోజు స్తంభించిన బ్యాంక్ సేవలు

Badvel: రెండవ రోజు స్తంభించిన బ్యాంక్ సేవలు
x
Highlights

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగస్తులు చేస్తున్న సమ్మెలో భాగంగా శనివారం పట్టణంలో సమ్మె చేశారు.

బద్వేల్: దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగస్తులు చేస్తున్న సమ్మెలో భాగంగా శనివారం పట్టణంలో సమ్మె చేశారు. దీనిని ఉద్దేశించి యూనియన్ నాయకులు మాట్లాడుతూ... 2017 సంవత్సరం నవంబర్ నుంచి బ్యాంకు ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి ఉందని, ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోలేదని బ్యాంకు ఉద్యోగులు, యూనియన్ నాయకులు అన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

స్పెషల్ అలవెన్స్ , బేసిక్ పేమెంట్స్ లో కలపాలని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అన్ని బ్యాంకు శాఖలలో ఒకే పని వేళలు ఉండాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే మార్చిలో ఆందోళనలు, ఏప్రిల్ లో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సెక్రెటరీ శ్రీనివాసులు, లోకల్ సెక్రెటరీ మార్టిన్, ఆఫీసర్లు చంద్రయ్య, నాగభూషణం, సిబ్బంది శైలజ, స్వరూప్, గురు ప్రసాద్, సురేష్, సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories