కర్నూలు జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం

admin1
Published on: 11 Nov 2019 8:22 PM IST
కర్నూలు జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం
X

కర్నూలు జిల్లాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసం చేయడమే కాకుండా డబ్బులు అడిగిన వారిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. నంద్యాలకు చెందిన గంగు ఆనంద్ ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వాలంటు ఒత్తిడి చేసిన వారిపై కత్తితో వీరంగం సృష్టించాడు. వెంటాడి మరీ దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

admin1

admin1

Next Story