Sajjala: టీడీపీ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉంది.. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు తెలిసింది

Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల.

Arun Chilukuri
Published on: 24 Aug 2023 3:48 PM IST
Sajjala Ramakrishna Reddy About Fake Voters List
X

Sajjala: టీడీపీ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉంది.. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు తెలిసింది

Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. దొంగే దొంగ అన్నట్లుగా టీడీపీ తీరు ఉందని విమర్శించారు. అక్రమాలు చేయడంలో.. అడ్డదారులు తొక్కడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారన్నారు సజ్జల. తమకు ఆ అవసరం లేదని.. ప్రజల మెప్పు పొంది ఎన్నికల బరిలో దిగుతామన్నారు. రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదన్న సజ్జల ... ఆ 60 లక్షల ఓట్లు ఎవరివో కూడా తెలియదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story