ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి రూ. 9 కోట్ల పరిహారం

ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన మహిళ కుటుంబానికి రూ. 9 కోట్ల  పరిహారం
x
Highlights

Compensation: బస్సు ప్రమాదంలో మరణించిన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబానికి 9కోట్లు పరిహారాన్ని ఎపీఎస్ఆర్టీసీ చెల్లించాలని సుప్రీంకోర్టు...

Compensation: బస్సు ప్రమాదంలో మరణించిన అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ కుటుంబానికి 9కోట్లు పరిహారాన్ని ఎపీఎస్ఆర్టీసీ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింద. లక్ష్మీ నాగళ్ల అనే మహిళ 2009జూన్ 13న తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ మరణించింది.

అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600డాలర్లు సంపాదిస్తున్నారని..ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి 9కోట్ల పరిహారం ఇప్పించాలని లక్ష్మీ భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్ లో కేసు వేశారు. వాదనలు విన్న ట్రైబ్యునల్ రూ. 8.05కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తు తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించింది. రూ. 5.75కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ ఆమె భర్త సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు 9, 64,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories