Vizianagaram: విజయనగరం జిల్లా జొన్నాడ సమీపంలో రోడ్డు ప్రమాదం

Vizianagaram: కారును తప్పించబోయి సైకిల్‌, పాదచారుడిని ఢీకొన్న బొలెరో వాహనం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 July 2024 7:00 PM IST
Road Accident Near Jonnada, Vizianagaram District
X

Vizianagaram: విజయనగరం జిల్లా జొన్నాడ సమీపంలో రోడ్డు ప్రమాదం

Vizianagaram: విజయనగరం జిల్లా జొన్నాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంకలాం వైపు నుంచి వెళ్తున్న బొలెరో వాహనం కారును తప్పించబోయి సైకిల్‌ను, పాదచారుడిని ఢీ కొట్టిన ఘటనలో బొలెరో వాహనం బోల్తా పడింది. సైక్లిస్ట్, పాదచారుడు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సైక్లిస్ట్ జొన్నాడ గ్రామానికి చెందిన‌వాడు కాగా, పాదచారుడు పార్వతీపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. బొలెరో బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జొన్నాడకు సమీపంలో బంగారమ్మపేట వాసులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story