Visakha: ఘోర ప్రమాదం.. యువకుల ప్రాణాలు తీసిన అతివేగం

Road Accident In Visakha
x

Visakha: ఘోర ప్రమాదం.. యువకుల ప్రాణాలు తీసిన అతివేగం

Highlights

Visakha: తీవ్ర గాయాలపాలైన మరో యువకుడు

Visakha: విశాఖలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడ్డ యువకుడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎన్ఏడీ కొత్తరోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రిలో మృతి చెండాడు. శనివారం రాత్రి పూట.. డ్యూక్ బైక్ పై ముగ్గురు యువకులు ఫ్లైఓవర్ పై వస్తున్నారు.

అతివేగంగా వచ్చిన వీరు బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ వాల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో యువకుడికి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories