Nellore: రెండు లారీలు, ప్రైవేట్‌ బస్సు ఢీ.. ఏడుగురు మృతి

Nellore: కావలి హాస్పిటల్‌లో క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్స

Jyothi
Published on: 10 Feb 2024 11:12 AM IST
Road Accident In Nellore District
X

Nellore: రెండు లారీలు, ప్రైవేట్‌ బస్సు ఢీ.. ఏడుగురు మృతి

Nellore: నెల్లూరు జిల్లా కావలి సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారికి హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతుంది. అయితే చెన్నై వైపు వెళుతున్న లారీ.. అదే మార్గంలో ముందు వెళ్తోన్న మరో లారీని ఢీకొట్టింది. ఆ లారీ కాస్త డివైడర్‌ను దాటి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జనుజ్జయింది. సమాచారం తెలుసుకున్న కావలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, బాధితుల సమాచారం కోసం నెల్లూరు ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబాలకు చెందిన వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు.

Jyothi

Jyothi

Next Story