Road Accident in Kurnool: రోడ్డు ప్రమాదం.. ఎస్‌బీఐ ఉద్యోగి సజీవదహనం
Road Accident in Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్యాంక్ ఉద్యోగి ఒకరు సజీవదహనం అయ్యారు. నంద్యాల సమీపంలోని శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఓ కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ఉన్న ముగ్గురు బయటకు రావడానికి ప్రయత్నించగా ఒకరు తప్పించుకోలేక కారులోనే సజీవదహనం అయ్యారు.
మిగతా వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో సజీవదహనమైన వ్యక్తి నంద్యాల పట్టణంలో ఎస్‌బీఐ ఉద్యోగి శివకుమార్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు శివకుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరం, కాగా నంద్యాల ఎస్‌బీఐ బ్యాంకులో పనిచేస్తున్నాడు.
Next Story




