Raghu Rama Krishna Raju about PV Narasimha Rao: దేశం ఈ స్థితిలో ఉండటానికి పీవీ సంస్కరణలే కారణం

Arun Chilukuri
Updated on: 28 July 2020 6:34 PM IST
Raghu Rama Krishna Raju about PV Narasimha Rao: దేశం ఈ స్థితిలో ఉండటానికి పీవీ సంస్కరణలే కారణం
X

Raghu Rama Krishna Raju about PV Narasimha Rao: దేశం ఈ స్థితిలో ఉండడానికి కారణం దివంగత మాజీ ప్రధాని పీవీ సంస్కరణలే అని అన్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిగా పీవీ నంద్యాల లోక్ సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారని తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను ఏపీ ప్రభుత్వం కూడా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు తెలియజేశానని చెప్పారు. పీవీకి ఘన నివాళి విషయంలో ప్రజలు కూడా సీఎంకు లేఖలు రాయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్న విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. వేడుకల కోసం రూ.10 కోట్లు కేటాయించారని.. వేడుకల కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిందన్నారు. పీవీ శతజయంతి వేడుకలను ఏపీలో నిర్వహించేందుకు కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఆయనకు భారతరత్న ఇచ్చేలా కేంద్రం ప్రతిపాదనలు కూడా పంపాలని కోరారు. పీవీ శతజయంతి వేడుకుల కోసం కేబినెట్ సబ్ కమిటీ, శతజయంతి వేడుకల కమిటీని కానీ ఏర్పాటు చేయాలన్నారు. నిధులు కేటాయించాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story