Anantapur: ఆటో బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..

Anantapur: మాళపురం నుంచి ఇంద్రావతి గ్రామానికి వెళ్తుండగా ఘటన

Jyothi
Published on: 5 April 2024 2:12 PM IST
Road Accident In Anantapur
X

Anantapur: ఆటో బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..

Anantapur: అనంతపురం జిల్లా ఉరవకొండలో కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. 15 మంది కూలీలకు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విడపనకల్లు మంజలం మాళపురం నుంచి ఇంద్రావతి గ్రామానికి కూలీలు ఆటోలో వెళ్తుండగా గొర్రెలు అడ్డు రావడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. గాయపడిన వారిని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story