రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం !

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం !
x
Highlights

RLIS Triggers Political Storm in Two Telugu States: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద దుమారమే లేస్తోంది....

RLIS Triggers Political Storm in Two Telugu States: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద దుమారమే లేస్తోంది. మాకు నష్టమంటే మాకు నష్టమంటూ కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఐతే ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా వచ్చే లాభాలు ఏంటి...? తెలంగాణకు కలిగే నష్టాలు ఏంటి అన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది.

ప్రతీ సంవత్సరం వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టి, తమ వాటాను దక్కించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో దక్షిణ తెలంగాణ ప్రాంతమంతా పూర్తిగా ఎడారిగా మారిపోతుందని ఆ ప్రాంత నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనకు తెలంగాణా ప్రభుత్వం సైతం మద్దతిచ్చి ప్రాజెక్టు ఆపాలంటూ కృష్ణ నది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. అయితే తెలంగాణలో నిర్మాణంలో ఉన్న 5 ప్రాజెక్టులను కూడా నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సైతం కేఎంబీఆర్ కు కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలు అఫెక్స్ కమిటీ ముందు తమ వాదనలను వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.

రాయలసీమకు సాగునీటితో పాటు త్రాగునీటికి జీవనాడిగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ జిల్లాలోని ప్రాజెక్టులకు అటు సీమలోని ప్రాజెక్టులతో పాటు నెల్లూరు, చెన్నైకి సైతం మంచి నీటిని అందిస్తుంది. రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ కనిష్టంగా 854 అడుగులు ఉండాల్సిందే. ఐతే, శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీరు ఉన్నప్పుడు కూడా వీటిని మళ్ళించేందుకు వీలుగా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణాన్ని రూపొందించారు. పోతిరెడ్డిపాడు నీటిని సరఫరా చేసే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకొచ్చి 203 జీవోను జారీ చేసింది. ప్రాజెక్టును నిర్మించేందుకు 3 వేల 278 కోట్లు సేంక్షన్ చేసింది. ఈ ప్రక్రియలో టెండర్లను సైతం ఆహ్వానించింది. రెండున్నర సంవత్సరం లోపల ప్రాజెక్టును పూర్తి చేసి సీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించెలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

ప్రతిరోజు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకొనే విధంగా రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సంగమేశ్వరం నుండి పన్నెండు పంపుల ద్వారా 39.6 మీటర్ల పైకి నీటిని ఎత్తి పోసుకునెలా పంప్ హౌస్ నిర్మాణం చేయనున్నారు. సంగమేశ్వరం ముచ్చుమర్రి మధ్య నుంచి సుమారు 22 కిలోమీటర్ల పాటు అప్రోచ్ కెనాల్ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్నటువంటి యస్సార్ ఎం సి కాలువలో కలుపుతారు. ఈ నీటిని బనకచర్ల హెడ్రెగ్యులేటర్ కాంప్లెక్స్ కు తరలించి అక్కడి నుండి తెలుగు గంగకు, కె సి ఎస్ కేప్ ఛానల్ కు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కు సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియలో 22 కిలోమీటర్ల మేర అప్రోచ్ కెనాల్ కోసం సుమారు 1200 ఎకరాల భూసేకరణ అవసరం కావచ్చు అన్నది అధికారుల ఆలోచన.

వృధాగా ప్రతి సంవత్సరం సముద్రంలోకి పోతున్న నీటితో తమ వాటాను పూర్తి స్థాయిలో దక్కించుకోలేకపోవడంతో ఈ ప్రాజెక్లును తెరపైకి తెచ్చామన్నది ఏపీ ఇరిగేషన్ అధికారుల వాదన. ప్రతి సంవత్సరం వరద దినాల సంఖ్య తగ్గి పోవటంతో పాటు నీటిని మళ్ళించే కాలువలు, ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో పని చేయకపోవడం శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగులకు పెరిగిన తర్వాతనే నీరు వచ్చే అవకాశం ఉండటం. ముఖ్యంగా రాయలసీమకు 111 టీఎంసీల నీరు పూర్తిస్థాయిలో తీసుకోలేకపోవడం. తీసుకునే లోపల ఆ నీరు సముద్రం పాలు కావటం లాంటి అవంతరాలు ఉండడంతో ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్ట్ను తెరపైకి తీసుకొచ్చినట్లు కొందరి సీమ నేతల వాదన.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది వందల అడుగుల నుంచే, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు లెఫ్ట్ పవర్ హౌస్ లో కరెంటు జనరేటర్ చేస్తూ వేల క్యూసెక్కుల నీటిని దిగువకు తీసుకుని వెళ్తుంటే, 854 అడుగులు నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది అన్నది వారి ప్రశ్న. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విమర్శలు చేస్తోంది అంటూ సీమనేతలు మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories