Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,842 పాజిటివ్ కేసులు

Arun Chilukuri
Published on: 24 Aug 2020 9:34 AM IST
Coronavirus updates in Telangana: తెలంగాణలో కొత్తగా 1,842 పాజిటివ్ కేసులు
X

Coronavirus updates in Telangana: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,842 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,091కి చేరింది. మృతుల సంఖ్య 761కి పెరిగింది. మరోవైపు నిన్న 1,825 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 82,411కి చేరింది. ప్రస్తుతం 22,919 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 373, నిజామాబాద్‌ జిల్లాలో 158, కరీంనగర్‌ జిల్లాలో 134, సూర్యాపేట జిల్లాలో 113, రంగారెడ్డి జిల్లాలో 109 కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో రికవరీ రేటు 77.67 శాతంగా ఉందని తెలిపింది. గత 24 గంటల్లో 36,282 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని, దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 9,68,121 కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.





Arun Chilukuri

Arun Chilukuri

Next Story