RK Roja: ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ గా మార్చారు..

RK Roja: ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండాపోయిందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Oct 2024 6:58 AM IST
RK Roja Comments on Law and Order in Andhra Pradesh
X

RK Roja: ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ గా మార్చారు..

RK Roja: ఏపీలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండాపోయిందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. వరుస అత్యాచారాలు, హత్యలతో ఆంద్రప్రదేశ్ ను అత్యాచారాంద్రప్రదేశ్ గా మార్చేసిందని విమర్సించారు. రాష్ట్రంలో మహిళలపై హత్యలు,అత్యాచారాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కన్పించడం లేదా అని ప్రశ్నించారు.

ఏ ముహూర్తంలో చంద్రబాబు రాష్ట్రానికి సీఎం అయ్యారో కానీ ఆడపిల్లలను నరికి చంపుతున్నారు తగలబెట్టి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు పెద్దవారు అత్తా కోడలు అని వరుస లేకుండా మతిస్థిమితం లేని వారిని సైతం చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని రోజా ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story