పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

ప్రమాదపుటంచున పోలవరం ముంపు గ్రామాలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 July 2024 7:30 PM IST
Rising Godavari flood at Polavaram Project
X

పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి

ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. దీంతో పోలవరం ముంపు గ్రామాలు.. ప్రమాదపుటంచున ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వరదల నేపథ్యంలో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. పోలవరం ముంపు గ్రామాల వాసులు భయాందోళనకు గురయ్యారు. పోలవరం నిర్వాసితులు ఇళ్లు ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్ట్ 48 గేట్ల నుంచి 7లక్షల, 86వేల, 680 కూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story