లంగర్లకు చిక్కిన బోటు..బయటకు తీసేందుకు యత్నిస్తున్న సత్యం బృందం..

Arun Chilukuri
Updated on: 30 Sept 2019 5:13 PM IST
లంగర్లకు చిక్కిన బోటు..బయటకు తీసేందుకు యత్నిస్తున్న సత్యం బృందం..
X

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర ప్రమాదానికి గురైన పడవను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా బోటు మునిగిన చోట ఐదు లంగర్లు వేసింది సత్యం టీమ్. నీటి అడుగు భాగంలో రెండు లంగర్లు గట్టిగా పట్టుకున్నాయి. దీంతో అవి బోటుకే తగులుకుని ఉంటాయని భావిస్తున్నారు. లంగర్లకు కట్టిన ఐరన్‌ రోప్‌లను ప్రొక్లెయినర్‌తో లాగుతోంది సత్యం బృందం. బోటు వెలికితీత నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story