రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం..మీ ఆస్థి దస్తావేజు మీరే తయారు చేసుకోవచ్చు!

రిజిస్ట్రేషన్   ప్రక్రియ సులభతరం..మీ ఆస్థి దస్తావేజు మీరే తయారు చేసుకోవచ్చు!
x
Highlights

ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన దస్తావేజులు తయారు చేయించడం కోసం లేఖరిని సంప్రదించాల్సి వచ్చేది ఇంత వరకూ. వారు తయారు చేసి ఇచ్చిన...

ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన దస్తావేజులు తయారు చేయించడం కోసం లేఖరిని సంప్రదించాల్సి వచ్చేది ఇంత వరకూ. వారు తయారు చేసి ఇచ్చిన దస్తావేజు పట్టుకుని రిజిస్ట్రేషన్ ఆఫీసులో సమర్పించి.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి వచ్చేది ఇప్పటి వరకూ. ఇప్పుడు ఆ పధ్ధతి మారబోతోంది. మీరు కొనుక్కున్న ఆస్తికి సంభందించి మీరే మీ దరఖాస్తును ఆన్లైన్ లో రూపొందిచుకోవచ్చు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ తన వెబ్ సైట్ లో నమూనా దస్తావేజులను ఉంచింది. వీటిని ఉపయోగించి తెలుగులో అత్యంత సులభంగా భూములు, స్థలాలు, భవనాల వంటి స్థిరాస్తుల కొనుగోలుదారులు తమ డాక్యుమెంట్లు తయారు చేసుకోవచ్చు. న్యాయబద్ధంగా చెల్లుబాటయ్యేలా స్థిరాస్తి విక్రయ రిజిస్ట్రేషన్‌ దస్తావేజు సులభంగా తయారుచేసుకుని, దానిలో తప్పులు కూడా సరిచేసుకునే అవకాశమూ కల్పించింది రిజిస్ట్రేషన్ల శాఖ.

మీ దస్తావేజులు మీరే చేసుకోవచ్చు..

రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ కి వెళ్లి అక్కడ ఉన్న నమూనా దస్తావేజులలో మీకు సరిపోయే దానిని ఎంచుకోవాలి. దానిలో ఉన్న ఖాళీలను మీ వివరాలతో నింపుకోవాలి. తరువాత పూర్తయిన దస్తావేజును ఒకసారి పరిశీనిచుకోవాలి. ఏదైనా పొరపాట్లు ఉంటె సరిదిద్దుకోవాలి. అన్నీ సరిగా ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సబ్‌మిట్‌ క్లిక్‌ చేస్తే సదరు దస్తావేజు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ శాఖకు చేరుతుంది. రిజిస్ట్రేషన్ ఈరోజు చేసుకోవాలనుకున్తున్నారో ఆరోజు కు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న రోజు అదే సమయానికి సంబంధిత రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి అమ్మకందారులు, సాక్షులతో వెళ్లి అర గంటలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

ఎప్పటినుంచి..

ఈరోజు (సోమవారం) నుంచే ఈ విధానం అమల్లోకి వస్తోంది. అయితే, ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమె వీటిని అనుమతిస్తారు. ఈ నెలాఖరు వరకూ అక్కడ ఈ విధానంలో జరిగిన లావాదేవీల్ని పరిశీలించిన తరువాత మిగిలిన జిల్లాలకు దీనిని విస్తరిస్తారు.

దస్తావేజుల తయారీ ఇలా..

రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళితే ఎడమ వైపు కింది భాగంలో న్యూ ఇనిషియేటివ్స్‌ అనే బాక్సులో డాక్యుమెంట్‌ ప్రిపరేషన్‌ అని ఉంటుంది. దీనిని క్లిక్‌ చేసి పాస్‌వర్డ్, ఐడీ రిజిస్టర్‌ చేసుకుని డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో కొనుగోలుదారు పేరు, నివాస ప్రాంతం, ఆధార్‌ నంబరు, అమ్మకందారు పేరు, నివాస ప్రాంతం, అమ్మకందారు ఆధార్‌ నంబరు లాంటి వివరాలు నింపేందుకు ఖాళీలు వదిలి డాక్యుమెంటు ఉంటుంది. స్థిరాస్తి వివరాలు (సర్వే నంబరు/ఫ్లాట్‌ నంబరు/ప్లాట్‌ నంబరు, గ్రామం/ పట్టణం) లాంటి వివరాలను కూడా ఖాళీల్లో నింపితే డాక్యుమెంటు తయారవుతుంది.

ఆస్తి వివరాలు నమోదు చేసిన తర్వాత దాని రిజిస్ట్రేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రకారం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాలి. ఏరోజు, ఏ సమయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలో ముందే నిర్ణయించుకుని స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోదలిచారో కూడా పేర్కొనాలి. దస్తావేజు అంతా సక్రమంగా పూరించినట్లు నిర్ధారించుకున్న తర్వాత ప్రింటవుట్‌ తీసుకుని సబ్‌మిట్‌ అని క్లిక్‌ చేస్తే ఆ దస్తావేజు సంబంధిత సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళుతుంది. స్లాట్‌ బుకింగ్‌ ప్రకారం సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళితే ఆన్‌లైన్‌లోని వివరాలను పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజు కాపీ ఇస్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories