Punjab Election: పంజాబ్‌లో సీఎం అభ్యర్థిత్వంపై ఎన్నికలకు ముందే రాజుకున్న వేడి

Punjab Election: సమిష్టి నాయకత్వంతో ఎన్నికలకు వెళ్లాలని.. ఫలితాల తర్వాత సీఎం ఎవరనే దానిపై నిర్ణయించాలంటున్న శ్రేణులు.

Rama Rao
Updated on: 19 Jan 2022 11:23 AM IST
Referendum for CM Candidate in Punjab
X

 పంజాబ్‌లో సీఎం అభ్యర్థిత్వంపై ఎన్నికలకు ముందే రాజుకున్న వేడి

Punjab: పంజాబ్‌లో సీఎం అభ్యర్థిత్వంపై ఎన్నికలకు ముందే వేడి రాజుకుంది. కాసేపట్లో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు కేజ్రీవాల్. సీఎం అభ్యర్థి కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేశారు కేజ్రీవాల్. మరోవైపు సీఎం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ లో కూడా కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలంటున్నారు ప్రస్తుత సీఎం చన్నీ. చన్నీకి మద్దుతుగా యాక్టర్ సోనూ సూద్ వీడియో బైట్‌ను అధికారిక ట్విట్టర్ లో పోస్టు చేసింది కాంగ్రెస్.

చన్నీని సీఎం అభ్యర్థిగా ప్రకటించేలా అధిష్టానంపై ఆయన వర్గం ఒత్తిడి తెస్తోంది. అయితే ఇప్పటికే సీఎం పీఠంపై ప్రస్తుత పీసీసీ చీఫ్ సిద్ధూ కన్నేశారు. సమిష్టి నాయకత్వంతో ఎన్నికలకు వెళ్లాలని ఫలితాల తర్వాత సీఎం ఎవరనే దానిపై నిర్ణయించాలంటున్నారు మరికొందరు నేతలు.

Rama Rao

Rama Rao

Next Story