Tirumala: తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ

Tirumala: తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తగ్గిన రద్దీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 Sept 2024 8:15 PM IST
Reduced crowd of devotees on Tirumala Hill
X

Tirumala: తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ

Tirumala: నిత్యం భక్తుల రద్దితో కిటకిటలాడే తిరుమల కొండపై భక్తుల రద్దీ తగ్గింది. వినాయక చవితి పండుగతో పాటు ఏపీ, తెలంగాణల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ బాగా తగ్గుముఖం పట్టింది. వెంకన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడంతో తిరుమలకు చేరుకున్న భక్తులకు సంతృప్తికరమైన దర్శన భాగ్యం లభిస్తుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనానికి గంట నుంచి 2గంటల సమయం పడుతుంటే సర్వ దర్శనానికి డైరెక్ట్ క్యూలైన్ కొనసాగుతోంది. దీంతో భక్తులు త్వర త్వరగానే వెంకన్నను దర్శించుకుంటున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story