Jogi Ramesh: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు

తనపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారని.. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని జోగి రమేష్‌ మండిపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2024 2:42 PM IST
Red Book Constitution is Being Implemented in AP Says Jogi Ramesh
X

Jogi Ramesh: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు

Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పీఎస్‌లో విచారణకు జోగి రమేశ్ హాజరయ్యారు. ఘటన సమయంలో వినియోగించిన ఫోన్, కారును తీసుకొచ్చారు. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని తెలిపారు. నిరసన తెలిపేందుకు మాత్రమే చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లామన్నారు మాజీ మంత్రి జోగి రమేష్.

ప్రజలంతా సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం రెడ్ బుక్ అమలు చేసే పనిలో ఉన్నారు. కేసులకు భయపడేది లేదు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అని జోగి రమేష్‌ పేర్కొన్నారు. తనపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారని.. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని జోగి రమేష్‌ మండిపడ్డారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story