Ainavilli: రేషన్ సరుకులు ఇంటికే వస్తాయి: ఎమ్మెల్యే చిట్టిబాబు

Ainavilli: రేషన్ సరుకులు ఇంటికే వస్తాయి: ఎమ్మెల్యే చిట్టిబాబు
x
ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
Highlights

ప్రజలకు బియ్యమే కాకుండా అన్ని రేషన్ సరుకులను గ్రామ వాలంటీర్లు మీ ఇంటి వద్దకు తీసుకువస్తారని... వాలంటీర్లను మీ కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు.

అయినవిల్లి: ప్రజలకు బియ్యమే కాకుండా అన్ని రేషన్ సరుకులను గ్రామ వాలంటీర్లు మీ ఇంటి వద్దకు తీసుకువస్తారని... వాలంటీర్లను మీ కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ఈ మేరకు మండలంలోని మాగం గ్రామంలో శుక్రవారం హెల్త్, రేషన్, పిన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఎంపీడీఓ కె.ఆర్.విజయ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ... ప్రజలకు ఏ అవసరం వచ్చినా నాయకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. లోకల్ నాయకులు మీమీ గ్రామాల్లో వాలంటీర్లు ద్వారా సమస్యలను సచివాలయంలో పరిష్కరించుకోవాలి అన్నారు. అనంతరం లబ్ధిదారులకు పెన్షన్,హెల్త్, రేషన్ కార్డులను ఎమ్మెల్యే చిట్టిబాబు అందచేశారు. ఈ కార్యక్రమంలో గుత్తుల నాగబాబు, గన్నవరపు శ్రీనివాస్, కోకిల శ్రీనివాస్, కామన కృష్ణమూర్తి, పులిదిండి ప్రభాకర్, నంబూరి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories