Ramachandraiah: జగన్ కు ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి?

Ramachandraiah: వైసీపీ పాలనలో సామాన్యుల జీవితాలు దుర్భరంగా మార్చారు

Shekhar G
Updated on: 11 March 2024 8:15 PM IST
Ramachandraiah Comments On CM Jagan
X

Ramachandraiah: జగన్ కు ప్రజలు ఓట్లు ఎందుకు వేయాలి?

Ramachandraiah: జగన్ తో పొత్తు పెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఆరోపించారు. వైసీపీ పాలనలో సామాన్యుల జీవితాలు దుర్భరంగా మార్చారని అన్నారు. ఇన్ని వైఫల్యాలు ఉన్న సీఎం జగన్ సిద్దం పేరుతో ప్రజల్లోకి రావడం హ్యాట్సాఫ్ అని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్ కు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. దేశం అగ్రగామిగా వెళుతున్న తరుణంలో మన రాష్ట్రం నుంచి కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పొత్తులు పెట్టుకోవడం జరిగిందన్నారు. ఒకటి రెండు సీట్లు పెరుగుతాయనో లేదా ఓట్లు పెరుగుతాయానో పొత్తులు పెట్టుకోలేదని దేశ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story