ఢిల్లీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్ష

Arun Chilukuri
Published on: 11 Sept 2020 12:30 PM IST
ఢిల్లీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్ష
X

ఏపీలో దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌కు నిర‌స‌న‌గా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు దీక్ష చేప‌ట్టారు. ఢిల్లీలోని త‌న నివాసంలో ఆయ‌న దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాల‌యాల‌ను ప‌రిర‌క్షించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ఈ దాడుల ప‌ట్ల ప్ర‌భుత్వం ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, దేవాల‌యాల‌పై వ‌రుస దాడులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు అన్నారు. దాడులను అరికట్టలేకపోతే మతసామరస్యం దెబ్బతింటుందని ఎంపీ రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అంతర్వేది రథం దగ్ధంపై పోలీసులు నమ్మశక్యంకాని కారణాలు చెబుతున్నారని విమర్శించారు. ఆలయాల రక్షణ, ఆస్తుల విషయంలో ప్రభుత్వం నిర్దిష్టమైన విధానం పాటించాలని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం స్పందించాలని రఘురామ కోరారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఢిల్లీ లోని తన నివాసంలో ఈ దీక్షకు కూర్చున్నారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు దీక్షకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మద్దతు పలికారు. ఆయనకు సంఘీభావంగా దీక్షలో కూర్చుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story