Kotapadu: క్వారంటైన్‌ ఏర్పాటుకు చర్యలు

S. Srikanth
Published on: 2 April 2020 7:09 PM IST
Kotapadu: క్వారంటైన్‌ ఏర్పాటుకు చర్యలు
X

కె.కోటపాడు: మండలంలోని ఎ.కోడూరు సమీకత వసతి గహాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా తీర్చిదిద్దడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపిడిఒ కె.శచీదేవి, తహశీల్దార్‌ ఎం.లక్ష్మి, చౌడువాడ, లంకవానిపాలెం పిహెచ్‌సిల వైద్యాధికారులు రమేష్‌, ఆనంద్‌లతో పాటు వసతి గహ సంక్షేమ అధికారి ఈర్లె గోవిందులతో సమావేశం జరిగింది.

14 గదులతో ఉన్న వసతి గహంలో సుమారు 80 మందికి వైద్య సేవలు అందించవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. వీరికి భోజన సదుపాయం, ప్రతి బెడ్‌కు మధ్యలో కర్టెన్లు, డ్రింకింగ్‌ వాటర్‌, టాయిలెట్‌ వంటి ఏర్పాట్లను రెవెన్యూశాఖ చూసుకుంటుందని తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story